పట్టించుకోని పౌరసరఫరాల శాఖ
నవతెలంగాణ – అచ్చంపేట
ఇంట్లో గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ రాయితీ సిలిండర్ లు అచ్చంపేట పట్టణంలో బహిర్గతంగా కమర్షియల్ వ్యాపారాలకు వినియోగిస్తున్నారు. అక్రమ వ్యాపారాల పైన పౌరసరఫరాల శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పట్టణ వివిధ రెస్టారెంట్లు, హోటల్స్ లలో, కొన్ని వెల్డింగ్ షాప్ లలో ప్రధాన రహదారి గప్ చిప్ బండ్లు, ఇతర చిరు వ్యాపారాలు సైతం నిబంధనలకు విరుద్ధంగా రైతు గ్యాస్ వినియోగిస్తున్నారు. రాయితీ వంట గ్యాస్ సిలిండర్లు పక్క దారి పట్టకుండా తనిఖీలు చేయవలసిన పౌరసరఫరాల శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పట్టణంలో జోరుగా చర్చ జరుగుతుంది.
వంట గ్యాస్ అక్రమంగా వినియోగిస్తున్న వ్యాపారుల నుండి పౌర సరఫరా ల శాఖ అధికారులు ప్రతినెల మామూలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వంట గ్యాస్ రాయితీ సిలిండర్లు కమర్షియల్ వ్యాపారాలకు వినియోగించకుండా, విస్తృతంగా తనిఖీలు చేయాలి. అక్రమంగా వంట గ్యాస్ ను వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వంటగ్యాస్ వినియోగదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



