నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రం లోని జుక్కల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మార్కౌట్ వేసి నిర్మాణ పనులను జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ మరియు మాజీ జెడ్పిటిసి సాయ గౌడ్ పనులను ప్రారంభించారని జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరన ప్రతి ఒక్క లబ్ధిదారులు గృహ నిర్మాణాల పనులను త్వరగా ప్రారంభించుకోవాలని అన్నారు. పునాది దశలో మొదటి బిల్లును ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. లబ్ధిదారులకు ఎంత త్వరగా నిర్మాణాలు చేస్తే అంత త్వరగా డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో మూడు విడుదలుగా జమ చేయడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కర్రేవార్ సావిత్ర తో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ రాము, మాజీ జెడ్పిటిసి సాయా గౌడ్ , జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, యువజన నాయకుడు బొంపెల్లి విజయ్ కుమార్ , లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



