నవతెలంగాణ – జుక్కల
రెండో విడత వార్డు సభ్యుల శిక్షణ తరగతులు శనివారం నుండి 10 గ్రామ పంచాయతీల పరిధిలోని వార్డు సభ్యులకు శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. మండలంలోని జుక్కల్, గుండూర్ , హంగర్గా కంఠాలి , కత్తల్వాడి, ఖండేబల్లూర్, కేమ్రాజ్ కల్లాలి, కౌలాస్, లాడే గావ్, లొంగన్, గ్రామపంచాయతీలలోని 96 మంది వార్డ సభ్యులకు శిక్షణ తరగతులు ఈనెల 14 నుండి 18 వరకు నాలుగు రోజులపాటు నాగయ్య, అశోక్ గౌడ్, దివాకర్, నవీన్ అధికారులతో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మొదటిరోజు శిక్షణ తరగతులు ముఖ్యంగా వార్డు సభ్యులకు పంచాయతీ రాజ్ చట్టాల గురించి వివరించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు ఎంపీ ఓ రాము, 10 గ్రామాల జిపి కార్యదర్శులు, ట్రైనర్స్, మండల పరిషత్ సిబ్బంది, వివిధ గ్రామాల జి పి వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వార్డు సభ్యుల శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



