నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని కమ్మర్పల్లి అటవీ రేంజ్ కార్యాలయం కాంప్లెక్స్ లో శనివారం అవగాహన సమావేశాన్ని నిర్వహించినట్లు రేంజ్ అధికారి రవీందర్ తెలిపారు. ఈ అవగాహన సమావేశంలోపూణేలోని టైగర్ రెస్క్యూ టీం, హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ నుండి వెటర్నరీ వైద్యులు హాజరై అటవీశాఖ సిబ్బందికి అవగాహన కల్పించారు.రిజర్వ్ ఫారెస్ట్ లోపల లేదా వెలుపల టైగర్ మూవ్మెంట్ కనిపించినప్పుడు తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలు, టైగర్ మూవ్‌మెంట్‌ను ఎలా గుర్తించాలి, దాని స్థానాలను గుర్తించడం ద్వారా ట్రాప్ కెమెరాను ఎలా అమర్చాలి, టైగర్‌ను ఎలా ప్రశాంతపరచాలి, ప్రదేశాలను గుర్తించి పగ్ మార్క్‌లను ఎలా గుర్తించాలి, పులి పశువులపై దాడి చేసినప్పుడు లేదా చంపినప్పుడు తీసుకోవలసిన తక్షణ ముందు జాగ్రత్త చర్యలు ఏమిటో వివరించారు. రెస్క్యూ టీం గత 6 నెలల నుండి దానిపై పనిచేస్తున్నప్పుడు పులి ప్రవర్తన గురించి కూడా సమావేశంలో వైద్యులు వివరించారు. ఈ సమావేశంలో కమ్మర్పల్లి రేంజ్, సిరికొండ, ఇందల్వాయి రేంజ్‌ల సిబ్బంది, బేస్ క్యాంప్ వాచర్లు, తదితరులు ఈ అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు.
కమ్మర్పల్లి రేంజ్ కార్యాలయంలో అవగాహన సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



