Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యాదాద్రి భువనగిరి జిల్లాకు 190 యూనిట్లు మంజూరు..

యాదాద్రి భువనగిరి జిల్లాకు 190 యూనిట్లు మంజూరు..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
షెడ్యూల్డు కులముల కార్యాచరణ ప్రణాళిక 2025-26 సంవత్సరానికి గాను బ్యాంకు సంబంధిత (190) యూనిట్లను రూ.382.00 లక్షలతో (190) కుటుంబములకు ఆర్ధిక సహాయం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లాకు లక్ష్యముగా నిర్ణయించడం జరిగిందని కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకు ఋణముతో విద్యుత్ ద్విచక్ర వాహనాలు  118 యూనిట్లు, విద్యుత్ మూడు చక్రాల వాహనాలు 60 యూనిట్లు, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్, వ్యవసాయ సంబంధిత పరికరములు 12 యూనిట్లు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000/- లు, పట్టణాల్లో రూ.2,00,000/-లు కుటుంబ వార్షిక ఆదాయం కలిగియుండాలనారు.

రవాణా పథకాలకు తేది.01.07.2025 నాటికి 21సం.ల నుండి 50సం.ల మధ్య వయస్సు కలిగియుండాలని, వ్యవసాయ ఆధారిత పథకాలకు తేది.01.07.2025 నాటికి 21 సం.ల నుండి 60 సం.ల మధ్య వయస్సు కలిగియుండాలి. సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ పథకమునకు కనీసం 2.00 ఎకరముల భూమి, బోరుబావిలో నీరు  కలిగియున్న వారు అర్హులు జతచేయవలసిన ధ్రువ పత్రాలు  ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం (తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తీసి ఉండాలని,శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్,  రవాణా ఆధారిత పథకములకు సోలార్ యూనిట్ కొరకు, బోరుబావిలో నీరు కలిగియున్న ధృవీకరణ పత్రము సంబంధిత పంచాయతి కార్యదర్శి ద్వారా  జారి చేయబడి యుండాలని,పట్టాదారు పాస్ పుస్తకం వ్యవసాయ ఆధారిత పథకములకు సదరం సర్టిఫికెట్,, దివ్యాంగులకు, పాస్ పోర్ట్  సైజ్ ఫోటో, ఈ వి ద్విచక్ర వాహనాల కోసం ద్విచక్ర వాహనం ఆధారముగా చేయు వ్యాపారం చేయువారు  జొమాటో, స్విగ్గి,రాపిడో,  ఉబర్ లకు ప్రాధాన్యత ఉంటుందని,  ప్రాధాన్యత క్లెయిమ్ చేయడానికి సంబంధిత ధృవీకరణ పత్రం సమర్పించవలెను. 

వచ్చే ఐదేళ్ళ వ్యవధిలో కుటుంబములో ఒక్కరికి మాత్రమే స్వయం ఉపాధి పథకం మంజూరు చేస్తారు. స్వయం ఉపాధి పథకం మొదటిసారి వినియోగించుకొను, స్వయం ఉపాధిలో నైపుణ్యత కలిగిన వారికి ప్రాధాన్యము ఇవ్వబడుతుందన్నారు. 

దళిత బంధు పథకం పొందిన లబ్ధిదారులు అర్హులు కాదని, నైపుణ్యం, అనుభవం ఉన్న దరఖాస్తుదారులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందనారు. అనుభవ ధృవీకరణ పత్రాన్ని, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్    సమర్పించాలని, రవాణా రంగంలో రుణం పొందడానికి, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి, దివ్యాంగులకు 5 శాతం .  మొత్తం లక్ష్యంలో మహిళలకు 331/3 % ప్రాధాన్యత ఇవ్వబడుతుందని, ఈ నెల 24 దరఖాస్తు రిజిస్ట్రేషన్ కు చివరి తేది అని, దరఖాస్తును https://tgobmms.cgg.gov.in ఆన్లైన్ తేది ఈ నెల 17 నుండి 24  లోపల నమోదు చేసుకోవాలని, ఓబి ఎంఎంఎస్   లో పూర్తి చేసిన దరఖాస్తును అర్జీదారుడు డౌన్లోడ్ చేసుకుని సంబంధిత పత్రాలను జతచేసి ఎంపీడీవో కార్యాలయములో / పట్టణ ప్రాంతాల వారు మున్సిపల్ కమిషనర్ కార్యాలయములో అందజేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -