Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

- Advertisement -

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్

జిల్లాలో గృహ అవసరాలకు ఎల్పిజి గ్యాస్ కొరత లేదని వినియోగదారులు ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎల్.పి.జి. గ్యాస్ కొరత లేదని, రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం కాదని, తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ సూచించారు.జిల్లాలో గృహ వినియోగానికి అవసరమైన ఎల్.పి.జి. గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని, గ్యాస్ ఏజెన్సీల ద్వారా సిలిండర్ల సరఫరా నిరంతరంగా జరుగుతోందని తెలిపారు. ఎక్కడైనా సిలిండర్ల కొరత ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

అవసరమైనంత గ్యాస్ నిల్వలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని, ప్రజలు అనవసరంగా ఎక్కువ సిలిండర్లు బుక్ చేసుకోవడం లేదా నిల్వ చేసుకోవడం చేయవద్దని కోరారు.ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఆసుపత్రి లలో, రెసిడెన్షియల్ హాస్టల్స్, విద్యా సంస్థలలో ఎలాంటి కొరత  లేదని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -