Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే సహకారంతో ఆలేరులో సీసీరోడ్లు ప్రారంభం 

ఎమ్మెల్యే సహకారంతో ఆలేరులో సీసీరోడ్లు ప్రారంభం 

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు 
మండలంలోని ఆలేరు గ్రామంలో మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ సహకారంతో సీసీరోడ్లను ప్రారంభించినట్లు ఆ గ్రామ సర్పంచ్ శనివారం ఆ గ్రామంలోని ఒకటవ వార్డు రెండవ వార్డు 8వ వార్డులో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు అయిన పది లక్షలతో సిసి రోడ్లను పోసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో అన్ని వీధులలో బురదమయం లేకుండా సిసి రోడ్లు వేస్తామని అన్నారు.

ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ సహకారంతో అధిక నిధులు తీసుకొచ్చి గ్రామంలోని ప్రయోజన సౌకర్యార్థం కోసం ఈ పనులను చేపడుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా గ్రామంలో ఏమి సమస్యలు ఉన్నాయి ప్రజలు ఏమి కోరుకుంటున్నారు అనే విషయంపై గ్రామంలో పర్యటిస్తున్నామని అందులో అత్యవసరమైన పనులను గుర్తించి సత్వరమే ప్రజలకు అవసరం పడే పనులను చేపడుతున్నామని అన్నారు. రోడ్లు వీధిలైట్లు పారిశుభ్రత త్రాగునీరు సమస్య లేకుండా చూస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ హరీష్,వార్డు సభ్యులు వీరన్న,భాగ్యలక్ష్మి,భవాని,అక్తర్, మల్లేష్, వెంకటమల్లు, ఆలయ కమిటీ ఛైర్మెన్ లు కృష్ణ, సుధాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లేశం,కార్యదర్శి మనీదీప్ గ, సీనియర్ నాయకులు కాలేరు సుమన్, అజీమ్,శ్రీపాల్,కోరే శ్రీనివాస్,గౌస్,సూరయ్య, గోపాల్, శ్రీను,ఎదుగని రాజయ్య, కందిమల్ల వెంకన్న,  తథితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -