నవతెలంగాణ – ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో ప్రజల సౌకర్యార్థం ఆధార్ కేంద్రాలని ఏర్పాటు చేయాలని, ఆలేరు అఖిలపక్ష కమిటీ నాయకులు, మాజీ సింగిల్ విండో చైర్మన్, మొరిగాడి చంద్రశేఖర్ అన్నారు. ఆలేరు పట్టణంలో శనివారం ఆర్యవైశ్య భవనంలో ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా ఆధార్ సెంటర్లు ప్రజలకు అందుబాటు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రభుత్వ అధికారులు వెంటనే కలగజేసుకుని సమస్యను పరిష్కరించాలన్నారు. లేనియెడల మీసేవ కేంద్రాలకి ఆధార్ కార్డులో సవరణల బాధ్యతల అప్పజెప్పాలని స్థానిక అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అఖిలపక్ష కమిటీ నాయకులు పసుపునుర్ వీరేశం, సభ్యులు కామిటికారి అశోక్, బాంబే రవి, యేలుగల కుమారస్వామి, మంచన మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



