నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తో భేటీ
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల అంశమై చర్చ
సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ- కంఠేశ్వర్
ఇటీవల నూతనంగా ఎన్నుకోబడిన నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయంలో ఎమ్మెల్యే తో చర్చించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు కు తప్పకుండా కృషి చేస్తానని చెప్పారు.జర్నలిస్టులకు తమ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని గుర్తు చేశారు. దీంతో జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు పంచరెడ్డి శ్రీకాంత్, వాగ్మారే సుభాష్, కోశాధికారి రాజ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. రాజు పాటు కార్యవర్గ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే భూపతి రెడ్డిని కలిసిన జర్నలిస్టులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


