Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్మిక వ్యతిరేక విధానాలను వీడనాడాలి

కార్మిక వ్యతిరేక విధానాలను వీడనాడాలి

- Advertisement -

నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి..
రెండు రోజులపాటు కొనసాగుతున్న రాజకీయ శిక్షణా తరగతులు
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్

రెండు రోజులపాటు జరగనున్న ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలనీ టీయుసీఐ జాతీయ ఉపాధ్యక్షులు వనమాల కృష్ణ అన్నారు. శనివారం సూర్యాపేటలో శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని ఖండిస్తున్నామన్నారు. మూడవ ప్రపంచ దేశాలపై గుత్తాధిపత్యం కోసం అమెరికా చేస్తున్న కుట్రలకు మోడీ సర్కార్ వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు.

అదానీ, అంబానీలకు ఏజెంట్ గా వ్యవహరిస్తున్నదని, కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేలా కొనసాగుతున్నాయన్నారు.నిత్యవసర వస్తువుల ధరలు పెంచుతూ, ప్రజలను దోచుకుంటున్నదన్నారు. ప్రశ్నించిన వారిపై దేశద్రోహులని ముద్రవేస్తూ, ప్రజాస్వామ్యవాదులను నిర్బంధిస్తున్నదన్నారు. గత 70 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వ విధానాలు గత ప్రభుత్వాల కంటే అత్యంత ప్రజా వ్యతిరేకంగా కొనసాగుతున్నాయన్నారు. అందులో భాగంగానే కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నదన్నారు. కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. 

 ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.నరేందర్, రాజన్న, రామయ్య, హన్మేష్, వెంకటేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శిలు ముత్తెన్న, యాకుబ్ షావలి, ప్రవీణ్ రాష్ట్ర కోశాధికారి కిరణ్,రాష్ట్ర నాయకులు రాజేశ్వర్, సుధాకర్, రాము, మధుసూదన్, పుల్లన్న, నరసింహ, రామ్ లక్ష్మణ్, సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గొడ్డలి నర్సన్న, సయ్యద్ హుస్సేన్, లింగన్న, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -