Sunday, March 15, 2026
E-PAPER
Homeఆటలురన్నరప్‌గా భారత మహిళల హాకీజట్టు

రన్నరప్‌గా భారత మహిళల హాకీజట్టు

- Advertisement -

ఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో 2-0గోల్స్‌తో ఓటమి
ప్రపంచకప్‌ హాకీ క్వాలిఫయర్స్‌

హైదరాబాద్‌: సంచలన విజయాలతో ఫైనల్‌కు చేరిన భారత మహిళల హాకీ జట్టు రన్నరప్‌తో సరిపుచ్చుకుంది. జిఎంసి బాలయోగి స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో భారతజట్టు 0-2గోల్స్‌తో ఇంగ్లండ్‌ మహిళల చేతిలో ఓటమిపాలైంది. తొలి క్వార్టర్‌ 13వ ని.లో ఇంగ్లండ్‌ క్రీడాకారిణి గ్రేస్‌ కొట్టిన గోల్‌తో ఆ జట్టు 1-0 ఆధిక్యతలో నిలిచింది. ఆ తర్వాత మూడు క్వార్టర్‌ ముగిసే ముందు 43వ ని.లో నీల్‌ ఎలిజెబెత్‌ ఒక గోల్‌ చేయడంలో ఇంగ్లండ్‌ 2-0 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది.

తొలి క్వార్టర్‌లో, నాల్గో క్వార్టర్‌లో భారత్‌కు గోల్స్‌ చేసే అవకాశాలు లభించిన ఇంగ్లండ్‌ గోల్‌ కీపర్‌ సమర్ధవంతంగా నిలువరించడం విశేషం. ఇక నవ్‌నీత్‌ కౌర్‌ ఈ టోర్నీలో చేసిన 4గోల్స్‌తో భారత్‌ తరఫున అత్యధిక కొట్టిన క్రీడాకారిణిగా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో స్కాట్లాండ్‌ మహిళలజట్టు 1-0తో ఇటలీని ఓడించింది. సెమీస్‌కు చేరిన భారత్‌, ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌, ఇటలీ జట్లు ఎఫ్‌ఐహెచ్‌ ప్రపంచకప్‌ హాకీ టోర్నీకి అర్హత సాధించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -