Sunday, March 15, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత రాయబార కార్యాలయం ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ-యూకె నిరసన

భారత రాయబార కార్యాలయం ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ-యూకె నిరసన

- Advertisement -

– రోహిత్‌ చట్టం అమలుకు డిమాండ్‌
లండన్‌ :
భారత విద్యార్థీ సమాఖ్య ( ఎస్‌ఎఫ్‌ఐ), యునైటెడ్‌ కింగ్డమ్‌ కమిటీ ఆధ్వర్యంలో శనివారం లండన్‌లోని భారత రాయబార కార్యాలయం వెలుపల విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) నిబంధనలను తిరిగి తీసుకురావాలని, రోహిత్‌ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్‌ఎఫ్‌ఐ-యూకె కమిటీ కార్యదర్శి కామ్రేడ్‌ సోమిహా, ఉపాధ్యక్షురాలు అపర్ణ ప్రసంగించారు. అన్ని యూనివర్శీటీల క్యాంపస్‌ల్లో కుల వివక్షను నిర్మూలించాలని వారు డిమాండ్‌ చేశారు. విద్యార్థుల హక్కులను పరిరక్షించాలని, విద్యా సంస్థలలో సమానత్వాన్ని ప్రోత్సహించాలని వారు పిలుపునిచ్చారు. ఈ నిరసన ద్వారా ఎస్‌ఎఫ్‌ఐ-యూకె కమిటీ భారతదేశంలోని విద్యా వ్యవస్థలో ఎదురవుతున్న సమస్యలను వివరించే ప్రయత్నం చేసింది. యూజిసి నిబంధనల పునరుద్ధరణ, రోహిత్‌ చట్టం అమలు ద్వారా విద్యార్థులకు న్యాయం జరుగుతుందని, కుల వివక్ష లేని విద్యా వాతావరణం ఏర్పడుతుందని ఎస్‌ఎఫ్‌ఐ-యూకె నాయకులు పేర్కోన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -