Sunday, March 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అల్లర్లలో జైలుకెళ్ళిన కార్యకర్తలను పరామర్శించిన బిబి పాటిల్

అల్లర్లలో జైలుకెళ్ళిన కార్యకర్తలను పరామర్శించిన బిబి పాటిల్

- Advertisement -

నవతెలంగాణ – నిజాంసాగర్ : గత నెల ఫిబ్రవరి 21 న జరిగిన బాన్సువాడ అల్లర్ల ఘటనలో జైలుకెళ్ళిన కార్యకర్తలను మాజీ ఎంపీ బీబీ పాటిల్ ఆదివారం ఉదయం పరామర్శించారు. మండలంలోని తుంకిపల్లి గ్రామానికి చెందిన రౌత్ రాజు, విట్టల్ గత నెలలో జరిగిన అల్లర్ల కేసులలో రిమాండ్ కి వెళ్లి ఇటీవలే ఇంటికి తిరిగివచ్చారు. ఆదివారం ఉదయం కార్యకర్తలు ఇంటికి వచ్చిన విషయం తెలుసుకొని మాజీ  ఎంపీ బీబీ పాటిల్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించి భరోసాను ఇచ్చారు.ఆధార్య పడద్దని భవిష్యత్తులో కూడా అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ కొండ అనిల్ సెట్, మహమ్మద్ నగర్ బీజేపీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -