Sunday, March 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు

పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా ఆదివారం పంచాయతీ పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాగాపూర్, కమ్మర్ పల్లి  గ్రామ పంచాయతీల పరిస్థితి కార్మికులకు వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు డాక్టర్ నరసింహస్వామి, డాక్టర్ స్పందన పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి పలు రకాల రక్త పరీక్షలను కూడా నిర్వహించారు. అనంతరం మందుల అవసరం ఉన్న పంచాయతీ కార్మికులకు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి సర్పంచ్ కొత్తపల్లి అశోక్, నాగపూర్ సర్పంచ్ కంపదండి అశోక్, ఆరోగ్య విస్తీర్ణ అధికారి మహేందర్, పర్యవేక్షకులు మారుతి, బుచ్చమ్మ, ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -