Sunday, March 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రిటైర్డ్ పెన్షన్ దారుల చావుకు కారణం రేవంత్ రెడ్డే: హరీష్ రావు

రిటైర్డ్ పెన్షన్ దారుల చావుకు కారణం రేవంత్ రెడ్డే: హరీష్ రావు

- Advertisement -

– రిటైర్డ్ ఉద్యోగల నిరహార దీక్షకు మద్దతు తెలిపిన హరీష్ రావు
నవతెలంగాణ – సిద్దిపేట 

35 ఏండ్లు కస్టపడి పని చేసి రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులను రేవంత్ రెడ్డి రోడ్ల మీదకు తెచ్చాడనీ, రిటైర్డ్ పెన్షన్ బెనిఫిట్ రాక 60 మంది చనిపోయారనీ, వారి చావుకు కారణం రేవంత్ రెడ్డిఅని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. సిద్పేట జిల్లా కేంద్రం లో అంబేద్కర్ చౌరస్తాలో రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగల బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేస్తున్న నిరహార దీక్షకు హరీష్ రావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిన్న చూపు చూస్తోందని,  ఎన్నికల ముందు పెండింగ్ డి ఏ లు ఇస్తామని హామీలు ఇచ్చారనీ గుర్తు చేశారు.

ఉద్యోగులు దాచుకున్న డబ్బులు ఇవ్వడానికి రేవంతుకు మనసు రావడం లేదనీ, పదివేలు కోట్ల బకాయిలు ఇవ్వమని రిటైర్డ్ ఉద్యోగులు అడిగితే నన్ను కోసుకొని తిన్న డబ్బులు లేవని అంటున్నాడనీ అన్నారు. రూ.96వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి, మూసి అభివృద్ధి కోసం లక్ష 50 వేలు పెట్టీ 10వేల ఇండ్లు కూల్చడానికి సిద్ధం అయ్యాడనీ,  బడా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలకు డబ్బులు ఇస్తారు కానీ ఉద్యోగులు కు ఇవ్వడనీ అన్నారు. కమిషన్ ఇచ్చే వారికి డబ్బులు ఇస్తారు కానీ, కమిషన్ ఇవ్వని ఉద్యోగులకు డబ్బులు ఇవ్వరనీ, కెసిఆర్ హయంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు నెల లోపే బెనిఫిట్స్ ఇచ్చామని,  92వేల ఉద్యోగులు కెసిఆర్ హయంలో రిటైర్డ్ అయితే వెంటనే డబ్బులు చెల్లించామని అన్నారు.  ఉపాధ్యాయులను అవమానించేలా విద్యా కమిషన్ రిపోర్ట్ ఉందన్నారు. 

మల్లన సాగర్ నుండి మూసి కి నీటిని తరలించేందుకు డబ్బులు ఉన్నాయి కానీ, రిటైర్డ్ అయిన వారికి ఇచ్చేందుకు డబ్బులు లేవా అని ప్రశ్నించారు.  రైతులకు డబ్బులు ఇవ్వలేదు, మహాలక్ష్మి ఇస్తామని మహిళలను మోసం చేశారు,  ఉద్యోగుల గొంతుకగా అసెంబ్లీలో పోరాటముచేసి మీకు న్యాయం జరిగేలా చేస్తామని అన్నారు.  ఉద్యోగులు సంఘటితం అయి ప్రభుత్వం పై పోరాటం చేయాలనీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లక్ష యాభై అయిదు వేల కోట్ల అప్పులు తెచ్చిందనీ,  3 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు,   అందులో పదివేల కోట్లు రిటైర్డ్ ఉద్యోగుల కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పోనమల్ల రాములు,  ప్రధాన కార్యదర్శి  నాగిరెడ్డి,  ఆర్థిక కార్యదర్శి పన్యాల రాజిరెడ్డి, రాజులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -