Sunday, March 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సర్పంచ్ పద్మ స్వామితో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల కోసం చేపడుతున్న గృహ నిర్మాణ పథకం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -