Sunday, March 15, 2026
E-PAPER
Homeక్రైమ్తాడిచెట్టుపై నుండి పడి గీత కార్మికుడు మృతి 

తాడిచెట్టుపై నుండి పడి గీత కార్మికుడు మృతి 

- Advertisement -

నవతెలంగాణ – కల్లూరు 
ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలోని రఘునాథ గూడెం గ్రామానికి చెందిన గీత కార్మికుడు బండి నరసింహారావు(49) ఆదివారం ఉదయం కల్లు గీయటానికి తాడిచెట్టు ఎక్కి, ప్రమాదవశాత్తూ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ధనలక్ష్మి కుమారుడు ఉన్నారు. కల్లు గీస్తూ కల్లు అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారు. పోషించే వ్యక్తి మృతి చెందటంతో ఆ కుటుంబ సభ్యుల బాధ వర్ణనతీతంగా మారింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -