Sunday, March 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామారెడ్డిలో ఘనంగా కాన్షిరాం జయంతి వేడుకలు

కామారెడ్డిలో ఘనంగా కాన్షిరాం జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహరాజ్ ఆదేశాల మేరకు బహుజన సిద్ధాంతకర్త, రాజకీయ నేత మాన్య శ్రీ కాన్షిరాం 92 వ జయంతిని కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించినట్లు జిల్లా నాయకుడు భువనశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా నాయకులు బోలేశ్వర్ మాట్లాడుతూ భారతదేశ రాజకీయ వ్యవస్థలో పెను మార్పుకు నాంది పలికిన సామాజిక – రాజకీయ మేధావి కాన్షిరాం అని కొనియాడారు.

సాంస్కృతిక సమానత్వానికి పునాది వేసిన బహుజన యోధుడిగా ఆయన సేవలను గుర్తు చేశారు. మహాత్మా జ్యోతి రావు పూలే, ఛత్రపతి సాహు మహారాజు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లుతూ బహుజన సమాజానికి రాజకీయ చైతన్యం కల్పించి అధికారంలోకి తీసుకువచ్చిన మహానుభావుడు కాన్షిరాం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా నాయకులు లక్ష్మణ్, రాజు, రాజశేఖర్, లక్ష్మణ్, లింగం, డీటీయూ రాష్ట్ర నాయకులు అశోక్, హరికిషన్, రాజు, జిల్లా రజక సంఘం నాయకులు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -