Sunday, March 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జనాభా గణనను సమర్థవంతంగా నిర్వహించాలి

జనాభా గణనను సమర్థవంతంగా నిర్వహించాలి

- Advertisement -

అదనపు కలెక్టర్ విక్టర్
నవతెలంగాణ – కామారెడ్డి

2026 సెన్సస్ -’2027 కు సంబంధించిన దశ –1 గృహ జాబితా, గృహ గణన (HLO) కార్యక్రమం నిర్వహణకు సంబంధించి  జిల్లా స్థాయి, సబ్ డివిజన్ స్థాయి, ఛార్జ్ స్థాయి అధికారులకు ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ వి.విక్టర్ ఆద్వర్యంలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా గృహ జాబితా, గృహ గణన కార్యక్రమం 2026 మే 11 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ సందర్భంగా జిల్లా, ఉపజిల్లా అధికారులు, ఛార్జ్ అధికారులు, ఛార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లు , ఫీల్డ్ ట్రైనర్లు వంటి జనాభా గణన 2027 విధులకు కేటాయించిన అధికారులకు ముందస్తుగా శిక్షణ ఇవ్వడం జరుగుతున్నదని అదనపు కలెక్టర్ తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లాలోని జిల్లా , సబ్-డివిజనల్ అధికారులు, ఛార్జ్ అధికారులకు లెవల్ –1 శిక్షణా కార్యక్రమం 15.03.2026 నుండి 17.03.2026 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. బిఈ శిక్షణ కార్యక్రమం ఐ డి ఓ సి లోని సమావేశ మందిరంలో  3 రోజులపాటు 15 నుండి 17 వరకు ప్రతి రోజు ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

అదనపు జిల్లా సెన్సస్ అధికారి, సబ్ – డివిజనల్ జిల్లా సెన్సస్ అధికారులు, ఛార్జ్ సెన్సస్ అధికారులు , అదనపు ఛార్జ్ సెన్సస్ అధికారులుగా నియమించబడిన అధికారులు ఈ శిక్షణలో  దిశా నిర్దేశం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జనాభా లెక్కల గణన ప్రక్రియను సమర్దవంతంగా నిర్వహించాలని, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల ప్రణాళికలను ఖచ్చితమైన జనగణన గణాంకాలు పునాదిగా ఉంటాయని తెలిపారు. జనాభా గణన ను సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ పద్ధతిలో పారదర్శకంగా నిర్వహించనున్నట్లు  తెలిపారు. 

మొత్తం 33 అంశాలపై సమగ్ర సమాచారం సేకరించబడుతుందని మొదటి దశలో గృహాలు, భవనాలు, కుటుంబ వివరాలు, రెండో దశలో వ్యక్తిగత వివరాలు నమోదు చేస్తారని తెలిపారు. అధికారులు, ఎన్యూమరేటర్లు సమన్వయంతో పనిచేసి నిర్ణీత కాలపరిమితి లో జనాభా గణన ను పూర్తి చేయాలని ఆయన సూచించారు. శిక్షణలో  అదనపు  కలెక్టర్ ( లోకల్ బాడీ ) మధుమోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, సీఈఓ చందర్, ఆర్డీవో వీణ, సిపిఓ రఘునందన్, జిల్లాలోని సంబంధిత అధికారులు, తహశీల్దార్లు,  ఎంపీడీవో లు, మున్సిపల్ కమిషనర్లు  ఇతర సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.   

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -