నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రీ ఆర్కే హాస్పిటల్, చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించు పల్లెకి వైద్యం కార్యక్రమంలో భాగంగా 135వ ఉచిత వైద్య శిబిరం కామినేని హాస్పిటల్ ఎల్ బి నగర్ సంయుక్త ఆధ్వర్యంలో భువనగిరి మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరం ను భువనగిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. 99రోజుల ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కమిషనర్ రామలింగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం నందు మున్సిపల్ సిబ్బందికి బిపి, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహించి డాక్టర్ సలహా మేరకు వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరం నందు జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్ డాక్టర్లచే మున్సిపల్ సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు.
భువనగిరి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం వారు చేసే శ్రమ ఆ నిర్వచనీయమ్ కాబట్టి వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించి వారికి ఈ విధంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినందుకుగాను మున్సిపల్ కమిషనర్ ని మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ అభినందించారు. మున్సిపల్ సిబ్బంది క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించుకుని వారి ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేష్ కోరారు. వంద మందికి పైగా మున్సిపల్ సిబ్బందికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు శ్రీ ఆర్కే హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ చావా రాజ్ కుమార్ తెలియజేశారు. ఈ వైద్య శిబిరానికి సహకరించిన కామినేని హాస్పిటల్ డాక్టర్లకు మరియు వారి బృందానికి శ్రీ ఆర్కే హాస్పిటల్ సిబ్బంది, కంపెనీ పర్యవేక్షించిన హాస్పిటల్ ఇంచార్జ్ ఎంపల్లి కొండల్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.



