Sunday, March 15, 2026
E-PAPER
Homeఖమ్మంఒంటి పూట బడుల టైం టేబుల్ విడుదల

ఒంటి పూట బడుల టైం టేబుల్ విడుదల

- Advertisement -

– ఎంఈఓ ప్రసాదరావు 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

వేసవి వేడి తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలల్లో ఒంటి పూట బడులు నిర్వహించేందుకు విద్యాశాఖ సమయ పట్టిక విడుదల చేసింది అని ఎంఈఓ ప్రసాదరావు ఆదివారం తెలిపారు.సోమవారం నుండి అమలులోకి రానుంది అని అన్నారు.

ఉదయం 7:45 గంటలకు మొదటి బెల్ మోగగా, 7:50 నుంచి 8:00 వరకు ప్రార్థన నిర్వహిస్తారు.  అనంతరం పాఠాలు ప్రారంభమై మొత్తం ఆరు పీరియడ్లు నిర్వహించి మధ్యలో 10:00 నుంచి 10:20 వరకు విరామం ఇస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు పాఠశాలలు ముగుస్తాయి.  విద్యార్థులు ఉదయం 7:30 లోపు పాఠశాలకు చేరుకోవాలని ఉపాధ్యాయులు సూచించారు.అలాగే విద్యార్థులు నీటి సీసాలు తీసుకురావడం, పూర్తి యూనిఫాం ధరించడం తప్పనిసరి అని తెలిపారు.

ఎఫ్ఆర్ఎస్  హాజరు నమోదు ఉదయం 7:50 లోపు మరియు మధ్యాహ్నం 12:30 తరువాత నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -