నవతెలంగాణ – హైదరాబాద్: నవతెలంగాణ దిన పత్రిక సీజీఎం ప్రభాకర్ కుమారుడి వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎంఎన్ఆర్ గార్డెన్ లో రోహిత్ , కావ్యల వివాహం సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు బీవి రాఘవులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వేస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, సీఐటీయూ జాతీయ కోశాధికారి సాయి బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్, ఆంధ్రప్రదేశ్ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు , సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, కమిటీ సభ్యులు, ప్రజా సంఘాలు నాయకులు, ఏపీ సీపీఐ(ఎం) నాయకులు హాజరయ్యారు. అదేవిదంగా నవతెలంగాణ సంపాదకులు రాంపల్లి రమేష్, ప్రజాశక్తి సంపాదకులు తులసిదాస్, సీజీఎం అచ్చుత్ రావు, నవతెలంగాణ బోర్డు సభ్యులు, జీఎం లు, రీజినల్ మేనేజర్లు, సిబ్బంది , ప్రజాశక్తి బాధ్యులు హాజరయ్యారు. ఇంకా అనేక మంది ప్రముఖులు, రాష్ట్ర, జాతీయ నాయకులు, ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి పాల్గొన్నారు.









