Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సిద్దాపూర్ లో సీసీరోడ్ల పనులు ప్రారంభం

సిద్దాపూర్ లో సీసీరోడ్ల పనులు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలం జీపీ కేంద్రంలోని సిద్ధపూర్ గ్రామం లో నూతనంగా సీసీరోడ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సిద్ధాపూర్ గ్రామంలో కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్న కాలనీ వాసులకు రోడ్డు సరిగ్గా లేకపోవడం వలన ప్రజలు చాలా అవస్థలు పడ్డారని అన్నారు. ఈ క్రమంలో గ్రామ సర్పంచ్ సావిత్ర సాయా గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకొని నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారని అన్నారు. అనంతరం కాలనీ వాసులు సర్పంచ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జుక్కల్ మండల కేంద్రంలో మాదిరిగానే సిద్దాపూర్ లో కూడా అభివృద్ధి జరగాలని వారు ఆకాంక్షించారు. రోడ్లతోపాటు మురికి కాలువల అభివృద్ది పనులు కూడా చేపట్టి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని స్థానికులు కోరారు. ఈ కార్యక్రమానికి జుక్కల్ మరియు సిద్ధాపూర్ గ్రామ యువకులు ఆర్మీ లక్ష్మీకాంత్ పటేల్ ,కార్తీక్ గౌడ్, గైక్వాడ్ నర్సింగ్, బొంపల్లి వార్ విజయ్ కుమార్ పాల్గొనడం జరిగింది. రోడ్డు గుత్తి దారులు జాదవ్ సాయి కర్ణ,  (వార్డ్ మెంబర్) గైక్వాడ్ విట్టల్ ,అర్మాన్ మరియు గ్రామ ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -