Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జుక్కల్ పారిశుద్ధ కార్మికులకు పీపీఈ కిట్ల పంపిణీ

జుక్కల్ పారిశుద్ధ కార్మికులకు పీపీఈ కిట్ల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికులకు ఆదివారం నాడు జుక్కల్ గ్రామ సర్పంచ్ సావిత్ర సాయి గౌడ్ ఆధ్వర్యంలో పీపీఈ కిట్లు పంపిణీ చేయడమే కాక వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామపంచాయతీ ఆవరణలో 30 పడకల ఆస్పత్రి వైద్య బృందం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య పరీక్షల అనంతరం వారికి చిన్న చిన్న సమస్యలు ఉండడంతో ఉచితంగా ప్రభుత్వం మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా పారిశుద్ధ కార్మికుల సేవలను గుర్తించి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో జిపి కార్యవర్గ సభ్యులు పరిశుద్ధ కార్మికులకు శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్, జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామంలో ని పంచాయతీ పరిధిలో పారిశుద్ధ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ నిత్యం ప్రజల సేవలో ఉంటున్నారని, వారు పనిచేయక పోతే గ్రామం ఒట్టిపోతుందని అన్నారు. వారి సేవలు అభినందనీయమని సర్పంచ్ కొనియాడారు. పరిశుద్ధ కార్మికులకు అన్ని విధాలుగా గ్రామపంచాయతీ అండగా ఉంటుందని తెలిపారు. వారికి ఏ సమస్య వచ్చినా వెంటనే తీర్చడానికి సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని పారిశుద్ధ కార్మికుల నాయకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు జిపి కార్యదర్శి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయ గౌడ్, జూనియర్ అసిస్టెంట్ రాజు, ఆశ వర్కర్లు,  ఏఎన్ఎంలు, పారి శుద్ధ కార్మికులు యువ నాయకుడు బొంపెల్లి విజయ్ కుమార్, యువకులు తదితరులు పాల్గొన్నారు. 

పలు గ్రామాలలో ..మండలంలోని 30 గ్రామపంచాయతీలు అయిన పడంపల్లి గ్రామ సర్పంచ్ వాగ్మారే విజయ్ కుమారి, బిజ్జల్ వాడి సర్పంచ్ గంగాబాయి, మథుర తండా సర్పంచ్ చౌహన్ అనిత మోహన్ , చండే గావ్ సర్పంచ్ లక్ష్మణ్ , హంగర్గా సర్పంచ్ కుమ్మరి నర్సింలు, మాదాపూర్ సర్పంచ్ ఆశ చందర్ పటేల్, కత్తల్వడి సర్పంచ్ గోపాల్ రావు, నావల్ గా సర్పంచ్ జాదవ్ సునందా , లొంగన్ సర్పంచ్ నాగల గిద్దె ఉషారాణి, పెద్ద ఏడ్గి సర్పంచ్ అనిల్ కుమార్ , దోస్పల్లి సర్పంచ్ మారుతి , డోన్గావ్ సర్పంచ్ కె . శ్రీనివాస్ , సోపూర్ సర్పంచ్ తుకారం , మహ్మదాబాద్ సర్పంచ్ శకుంతల, లాడేగావ్ సర్పంచ్ రాజశేఖర్ పటేల్, బస్వాపూర్ సర్పంచ్ రమణ సురేష్ గొండ, ఖండే బల్లూర్ సర్పంచ్ చాకలి కృష్ణ , వజ్రకండి సర్పంచ్ సావిత్ర, గుల్లతాండ సర్పంచ్ రాథోడ్ సుమతి, చిన్నగుళ్ల సర్పంచ్ జ్ఞానేశ్వర్, కంఠాలి సర్పంచ్ నాగనాథ్, మై బాపూర్ సర్పంచ్ బశవ్వ,  పెద్దగుళ్ల సర్పంచ్ మాధవరావు దేశాయి, గుండూర్ సర్పంచ్ కాశీనాథ్, ఆధ్వర్యంలో ఆయా గ్రామాల సెక్రటరీలు గ్రామస్తులు కలిసి 99 రోజుల ప్రణాళికలో భాగంగా 30 గ్రామాల పంచాయతీల జిపి కార్మికులకు శాలువాతో సన్మానించారు. అనంతరం జిపి కార్మికులకు పిపిఈ కిట్లు అందజేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -