- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కేంరాజ్ కల్లాలి గ్రామ మాజీ సర్పంచ్ మాణిక్ మనుమరాలు వివాహం కార్యక్రమంలో నవ వధూవరులను జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల శుభకార్యాలలో పాల్గొనడం వలన వారు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. ఎన్ని పనులున్నా శుభకార్యాలకు వచ్చి కార్యకర్తలకు సంతోషాన్ని నింపడం మాజీ ఎమ్మెల్యేకు ప్రజలలో మంచి విశ్వాసం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు కేం రాజ్ కల్లాలి మాజీ సర్పంచ్ సుంకరి వెంకట్, మమదాబాద్ మాజీ సర్పంచ్ లక్షెట్టి సాయిలు, మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



