Monday, March 16, 2026
E-PAPER
Homeదర్వాజ165 బాలకల నేరమేమిటి?

165 బాలకల నేరమేమిటి?

- Advertisement -

తెహ్రాన్‌ నేలతో సమాధుల్లోంచి
165 మంది బాలికలు
అమాయకంగా ప్రశ్నిస్తున్నారు –
”మేము చేసిన నేరమేమిటి?”
నెతాన్యు రురాక్రమణలో
ధ్వంసమై కుప్పకూలిన
స్కూలు శకలాల్లో శవాలైన పిల్లలు,
ఆవరణలో చెల్లాచెదురైన
తమ పిల్లల పాదరక్షల చెంత
హృదయవిదారకంగా విలపిస్తున్న తల్లిదండ్రులు!
గాజాపై జియోనిస్టుల నిరంతర దాడుల్లో
శిథిలాలైన ఆసుపత్రులు, విద్యాలయాల్లో
మరణించిన వేలాది పౌరులు, పిల్లలు
ఇంతకూ వాళ్లు చేసిన పాపమేమిటి?
డాలర్‌ విస్తరణ కాంక్షకు
శ్మశానాలుగా మారిన దేశాల పౌరులకు
జన్మించినందుకా ఈ హత్యాంకాండీ
ఒక చోట మతాధిపతుల పాలనలో
స్వదేశీయులే బలి,
మరో చోట సామ్రాజ్యవాద రక్తదాహానికి
తరతరాల చరిత్రనే సాక్షి
వెంటాడుతున్న ఏక ధృవ రాజ్యశక్తి
టక్కరి డోనాల్డ్‌ ట్రప్‌ దారి దోపిడీ
చమురు దేశాల రాచరిక ఆధిపత్యం,
ఇప్పుడు సాగుతున్న యుద్ధకాండలో
భగ్గున పైకెగిసిన మిస్సెల్‌ మంటల్లో
అంచెలంచెలుగా
మాడి మసైపోతున్న మానవత!!

-నిఖిలేశ్వర్‌, 9177881201

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -