ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో, హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘సుయోధన’. సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. పలు హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన శ్రీ లక్ష్మి పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ, ‘మా డైరెక్టర్ ఈ కథ చెప్పిన వెంటనే మూవీ చేయాలని నిర్ణయించుకున్నాం. స్క్రిప్ట్ చదివాక మా మనసులోకి వచ్చిన మొదటి యాక్టర్ సాయికుమార్. ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ అన్నీ తానై ఈ ప్రాజెక్ట్‌ను నడిపించారు.
ఆయన సూచన మేరకే ప్రియదర్శిని అప్రోచ్ అయ్యాం. ఆయన చాలా బాగా నటించారు. స్ట్రాంగ్ సబ్జెక్ట్‌తో ఈ సినిమా నిర్మించాం. ఈ సినిమాను తన సొంత చిత్రంగా భావించి డైరెక్టర్ మాధవ్ తెరకెక్కించారు. మూవీ రూపకల్పనలో ఎంతో శ్రమించారు’ అని అన్నారు. ‘ఈ చిత్రంలో సంహిత అనే క్యారెక్టర్‌లో నటిస్తున్నాను. ఈ క్యారెక్టర్‌లో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్’ అని హీరోయిన్ ద్రిషిక చందర్ చెప్పారు. డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ, ‘దర్శకుడిగా ఇది నా మొదటి సినిమా. కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా ఈ కథ అనుకున్నాక, ప్రియదర్శిని కలిశాను. ఆయన ఈ మూవీ చేస్తే బాగుంటుందని అనిపించింది. స్క్రిప్ట్ విన్న తర్వాత ఆయన ఓకే చెప్పారు. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే సుయోధన క్యారెక్టర్ ఫస్ట్ నుంచీ సాయికుమార్‌నే అనుకున్నాను. ఛోటా కె ప్రసాద్ నాకు మంచి సజెషన్స్ ఇచ్చారు. ఈ మూవీ మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్‌టైన్ చేస్తుంది’ అని తెలిపారు.
‘సుయోధన’ రిలీజ్‌కి రెడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



