Monday, March 16, 2026
E-PAPER
Homeఆటలుత్రోబాల్‌లో కాంస్యం

త్రోబాల్‌లో కాంస్యం

- Advertisement -

సౌత్‌జోన్‌ త్రోబాల్‌ చాంపియన్‌షిప్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌
సౌత్‌జోన్‌ త్రోబాల్‌ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ సత్తా చాటింది. తిరుపతి వేదికగా జరిగిన 17వ సౌత్‌జోన్‌ పోటీల్లో తెలంగాణ పురుషుల జట్టు కాంస్య పతకం సాధించింది. కాంస్య పతక పోరులో కేరళపై 15-9, 15-7తో తెలంగాణ విజయం సాధించింది. ధీరజ్‌, నితిన్‌ సాగర్‌లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. లీగ్‌ మ్యాచ్‌ల్లో 15-12, 15-11తో కర్నాటకపై, 15-9, 15-9తో పుదుచ్చేరిపై గెలుపొంది నాకౌట్‌కు చేరుకున్న తెలంగాణ… సెమీఫైనల్లో నిరాశపరిచింది. 11-15, 10-15తో తమిళనాడు చేతిలో పోరాడి ఓడింది. సెమీస్‌లో ఓడినా, కాంస్య పతక పోరులో గెలుపొంది మెడల్‌తో మెప్పించింది. మహిళల విభాగంలో తెలంగాణ జట్టు లీగ్‌ దశ నుంచే నిష్క్రమించింది. కాంస్య పతకం సాధించిన మెన్స్‌ జట్టును తెలంగాణ త్రో బాల్‌ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌, ప్రధాన కార్యదర్శి కిరణ్‌ చారి అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -