– ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోనే రాష్ట్రంలో డ్రగ్ కల్చర్ ప్రబలిందని ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ విమర్శించారు. ఆదివారం హైదరాబాద్ గాంధీభవన్ ఎదుట వెంకట్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈగల్ టీమ్‌కు బీఆర్‌ఎస్ నాయకులు దొరికిన నేపథ్యంలో ఇకైనైనా కేటీఆర్ తప్పును ఒప్పుకుంటూ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నదని తెలిపారు.
ఇప్పటికైనా కేటీఆర్ తన తీరును మార్చుకోవాలని పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ హెచ్చరించారు. ప్రశాంతమైన మొయినాబాద్‌లో అమాయకులను డ్రగ్స్ వైపు కేటీఆర్ ఉసిగొల్పారని ఆయన ఆరోపించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై కేటీఆర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మారుస్తుంటే కేటీఆర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గతంలో కేటీఆర్ బావమరిది, ప్రస్తుతం ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారని ఆయన ఉదహరించారు.
కేటీఆర్‌తోనే డ్రగ్ కల్చర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



