Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్ల ధర్నా

కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్ల ధర్నా

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ఆశా వర్కర్లు (సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ ధర్నా చేపట్టినట్లు ఆశా వర్కర్లు తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే హెల్త్ కార్డులు ఇవ్వడంతో పాటు నెలకు రూ.26,000 వేతనం ఇవ్వాలని, మట్టి ఖర్చుల కోసం రూ.50,000 మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, నెలకు రూ.18,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చిందని అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా వాటిని అమలు చేయలేదని ఆశా వర్కర్లు పేర్కొన్నారు. ఆ హామీలను ప్రభుత్వం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో జిల్లా అధ్యక్షురాలు కేసరి ఇందిరా, ప్రధాన కార్యదర్శి బల్ల రాజశ్రీ, జిల్లా కోశాధికారి పద్మ, నాయకులు మమతా, లావణ్య, భాగ్య, మంజుల,పలువురు ఆశా వర్కర్లు పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -