నవతెలంగాణ హైదరాబాద్: 2025 సంవత్సరానికి గాను ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకెడమీ పురస్కారం దక్కింది. ఆయన రచించిన అనిమేష (దీర్ఘకవిత) సంపుటికి అవార్డు లభించింది. తెలంగాణాను తన హృదయంగా తెలంగాణను సర్వస్వంగా స్వరంగా భావించిన నిబద్ధత గల ఉద్యమ కారుడు డా. నందిని సిధారెడ్డి. తెలంగాణ స్వరాష్ట్రం కోసం తపించిన స్వాప్నికుడు. తెలంగాణ సాహిత్య సాంస్కృతిక చారిత్రక వికాసం కోసం ముందుకు కదిలిన నికార్సైన నాగలి రూపం. ‘బందారం’ మట్టి పొత్తిళ్ళ నుండి ఎదిగి వచ్చిన ఆయన తెలంగాణ తొలిదశ-మలిదశ ఉద్యమంలో భాగమయ్యిండు. ప్రజల పక్షాన కవిత్వం రాసిండు. తన వూరిని, బాపుని ఎన్నడూ మరవలె. ఈ రెండు ప్రభావిత అంశాలను చైతన్య పతాకంగా భుజానికెత్తుకొని తెలంగాణ నేలతత్వాన్ని పంచుతూ పోతుండు. మెదక్ స్టడీ సర్కిల్ – మరసం మొదలు పత్రికల, సంఘాలను స్థాపించిన ఉద్విగ్న కెరటం ఆయన. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ, తెలంగాణ సాహిత్య అకాడమీలో జరిపిన నిర్విరామ సాహిత్యశ్రమ ఆయన అంకిత భావానికి, పట్టుదలకు, నిబద్ధతకు నిదర్శనాలు. ‘జాగ తీరే గట్ల/ ఈ జాగల రేషమున్నది/ కుటిలం లేదు/ కువారం లేదు/కుండబద్దలు కొట్టినట్టు/ కడిగేసుడే ఎరుక’ అంటూ నిక్కచ్చితనాన్ని ఒంటినిండా నింపుకుని సాగే కవితా ఖడ్గం సిధారెడ్డి, బహుముఖీన ప్రక్రియల్లో, ఉద్యమాల్లో సాగుతున్న మహాసముద్ర ప్రవాహం సిధారెడ్డి. ‘అనిమేష’ ధీర్ఘకవిత కరోనా సమయంలో వచ్చన ధీర్ఘకవిత.
నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



