Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జగదాంబ ఆలయంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్ఐ 

జగదాంబ ఆలయంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్ఐ 

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
మాచారెడ్డి మండలం కాకులగుట్ట తాండ గ్రామంలోని జగదాంబ ఆలయంలో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటుచేసిన నాలుగు సీసీ కెమెరాలను సోమవారం మాచారెడ్డి ఎస్ఐ అనిల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మాచారెడ్డి, పాల్వంచ మండల ప్రజలు తమ గ్రామాలలో ఉన్న ఆలయాలు, మసీదులు, చర్చిలు అలాగే గ్రామంలోని ముఖ్య ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీనివల్ల భద్రత పెరగడంతో పాటు అనుమానాస్పద ఘటనలను నివారించడంలో సహాయపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  మాచారెడ్డి పోలీస్ సిబ్బంది, కాకులగుట్ట తాండ గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -