– టిఎల్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బాలు
నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణ లెక్చరర్ల ఫోరం టిఎల్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని కోరుతూ సోమవారం కామారెడ్డి ప్రజావాణిలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టిఎల్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాలు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 8 వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలు పెండింగ్లో ఉండడం వలన వివిధ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు వేతనాలు సరిగా పొందక తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కోవడం జరుగుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి పెండింగ్ ఫీజు బకాయిలను విడుదల చేసి అధ్యాపకులకు,విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఔ
బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుందని, ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న గతంలో చెప్పినట్లుగా పెండింగ్ బకాయిలను విడుదల చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని అన్నారు. ఫీజు బకాయిలను విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో అధ్యాపకులు అందరం కలిసి చాక్ డౌన్ నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సురేష్, బాల్ రెడ్డి, ప్రభాకర్, మురళి, నరేష్ కుమార్, మోహన్, భాస్కర్, మహిపాల్, సయ్యద్, శ్రీనివాస్, అఖిల్, సతీష్ కుమార్, రాజేష్ అంజయ్య, నర్సింలు, దేవరాజ్ అధ్యాపక బృందం పాల్గొన్నారు.



