నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
సోమవారం ప్రజావాణి కార్యక్రమం కు సిపిఐ ఎంఎల్ ప్రజాపందా మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి. వి. ప్రభాకర్. AIUKS. రాష్ట్రకార్యదర్శి. B. దేవారం లు మాట్లాడుతూ..నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో అంకాపూర్ గ్రామంలో ఇండ్లు లేని (కిరాయి కుంటున్న) ప్రజలు KCR ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూమి లో గుడిసెలు వేసుకోవడం ప్రయత్నించగా మీరు ఇబ్బందులు పడకండి త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ నిర్మించి అర్హులైన వారందరికీ మేము ఇస్తామని నాటి శాసనసభ్యులు హామీ ఇవ్వడంతో గుడిసెలు వేసుకునే ప్రయత్నానికి స్వస్తి పలికారనిగుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో డబుల్ బెడ్ రూమ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టకపోవడంతో సుమారు 54 మంది హైదరాబాద్ కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లి విజ్ఞాపన చేసుకుందామని ప్రయత్నం చేయగా నాటి శాసనసభ్యులు జీవన్ రెడ్డి మీకు మేము సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి ని కల్పిస్తానని తీసుకువెళ్లే అరెస్టు చేయించి పోలీస్ స్టేషన్లో నిర్భందించారు.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో…. గత్యంతరం లేని స్థితిలో తర్వాత మేము వెంటనే సర్వే చేయించి డబుల్ బెడ్ రూములు మీకు కేటాయిస్తామని హామీ ఇచ్చి.. సర్వే చేయించి లబ్ధిదారుల జాబితాలో అందరి పేర్ల జాబితాలో చేర్చారు అని అన్నారు.
నిర్మాణం పూర్తి కాకముందే KCR ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయింది… గత శాసనసభ్యులు ఓడిపోయారు.. గెలిచిన BJP శాసనసభ్యులు రాకేష్ రెడ్డి పాత జాబితాను పక్కనపెట్టి (తుంగలో తొక్కి)ఏలాంటి సర్వే లేకుండా పూర్తి చేసిన 96 డబుల్ బెడ్ రూమ్లలో 21 మంది అర్హులు కాని వారినిచేర్చి అర్హులను తొలగించారు.
అర్హులకు కేటాయించాలని,నిరాహార దీక్షలు చేసిన రెవెన్యూ అధికారులు స్పందించక మొద్దు నిద్రలో ఉన్నారని ఎద్దేవాచేశారు. దీంతో గత్యంతరం లేక హైకోర్టును ఆశ్రయించగా… ఖాళీగా ఉన్న నాలుగు డబుల్ బెడ్ రూమ్ లను సర్వే చేసిన జాబితాలో నలుగురికి ఇవ్వాలని.. 21 మంది అనహరువులను తొలగించాలని.. నిర్మాణంలో ఉన్న 28 ఇండ్లలో ఇండ్లను సర్వే జాబితాలో అనుగుణంగా ఉండాలని హైకోర్టు ఆదేశించింది. 40 పూర్తి కావలసిన డబుల్ బెడ్ రూమ్ లను నిబంధనలను పాటించి సర్వే జాబితాలను పరిగణంలోకి తీసుకొని ఫైనల్ చేయాలని కూడా సూచించిందని అన్నారు.
ఈ మేరకు జిల్లా ప్రధమ న్యాయమూర్తి జిల్లా కలెక్టర్ ని కలిసి విషయం వివరించడానికి ప్రయత్నించగా సమాచారమంతా కూడా గౌరవనీయులైన కలెక్టర్ సేకరించుకున్నారు వెంటనే అధికారులను పిలిచి ఎలాంటి సర్వేలు చేయకుండా కేటాయించడం సరికాదని దీనికి బాధ్యులు ఎవరని అడిగిఎవర్ని సస్పెండ్ చేయాలని అధికారులను హెచ్చరించారు.
ఆదర్శ గ్రామమైన అంకాపూర్లో పేదలకు అన్యాయం జరిగిందని దీన్ని సరి చేయకపోతే మరో దఫా ఆందోళనకు దీక్షలకు పూనుకుంటామని గుర్తు చేస్తూ ఈమెర కు కలెక్టర్ న్యాయం చేస్తారని ఒక విశ్వాసం పేదలకు కలిగిందని ఈ సందర్భంగా కలెక్టర్ కి అభినందనలు తెలిపారు. అంకాపూర్ డబుల్ బెడ్ రూమ్ పంపిణీలోజరిగిన అవకతవకల పై విచారణ జరిపి వెంటనే నివేదిక ఇవ్వాలని తప్పుడు పద్ధతులు పాటించిన అధికారులను గుర్తించి నా దృష్టికి తేవాలని అధికారులను ఆదేశించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా కింది స్థాయి అధికారులు మొద్దు నిద్ర వీడి కలెక్టర్ ఆదేశాన్ని త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో… సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా ఆర్మూర్ సంయుక్త మండల కమిటీ కార్యదర్శి…బి. కిషన్.. అఖిలభారత ఐక్య రైతు సంఘం నాయకులు. నిఖిల్.. గ్రామస్తులు రఫీ. భోజమ్మ. sr రాజవ్వ. అబ్బమ్మ. సంతోష్ తదితరులు పాల్గొన్నారు.



