వీబీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు
నవతెలంగాణ – మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు డిమాండ్ చేశారు. సోమవారం సదాశివపేట్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. అంతకు ముందు సదాశివపేటలోని అంబేద్కర్ విగ్రహం నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన చుక్క రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి దాని స్థానంలో వీబీజీ రాంజీ పథకాన్ని తీసుకువచ్చి పేదలను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. కూలీలకు పనులు ప్రారంభించే ముందు ఒక ఫోటో పనులు పూర్తయిన తర్వాత మరో ఫోటో తీయాలనే నిబంధనను తొలగించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో టెన్త్ తాగునీరు మౌలిక సౌకర్యాలు కల్పించాలని, కూలీలకు రోజుకు 600 లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ కు వినతి పత్రం అందజేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఎంపీడీవో హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, సదాశివపేట మండల కార్యదర్శి ప్రవీణ్ కుమార్, పెద్ద ఎత్తున కూలీలు తదితరులు పాల్గొన్నారు.




