– తుంగతుర్తి సర్పంచ్ మల్లెపాక సాయిబాబా..
నవతెలంగాణ – తుంగతుర్తి
బండి సంజయ్ ని విమర్శించే అర్హత తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు కు లేదని తుంగతుర్తి సర్పంచ్ మల్లెపాక సాయిబాబా అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సామాన్య కార్యకర్త స్థాయి నుండి దేశం కోసం,ధర్మ కోసం పనిచేస్తూ కౌన్సిలర్ నుండి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన బండి సంజయ్ ను విమర్శించడం సామేలు అవివేకానికి నిదర్శనం అన్నారు.
సామేలు ప్రవర్తనతో సొంత పార్టీ కార్యకర్తలే ఛీ కొడుతున్నారని, తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనం అన్నారు. కరీంనగర్లో కవాతు చేస్తే అక్కడి దళితులే బుద్ధి చెప్తారని అన్నారు. ఇప్పటికైనా నియోజకవర్గంలో అవినీతి, బంధుప్రీతి వదిలేసి, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు.



