- Advertisement -
నవతెలంగాణ – ఆత్మకూరు
తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన గుట్కా, అంబర్ అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిని ఆత్మకూరు పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సీఐ ఆర్ సంతోష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తిరుమలగిరి గ్రామంలో ఇర్సడ్ల కుమారస్వామి (38) షాపులో నిషేధిత అంబర్ గుట్కా విక్రయిస్తున్నాడు అన్న విశ్వసనీయ సమాచారంతో స్థానిక పోలీసులు తనిఖీ చేసి అంబర్ ,గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసి నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై సతీష్ , పోలీస్ సిబ్బంది నర్సింగరావు పాల్గొన్నారు.
- Advertisement -



