Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదల సొంతింటి కల కాంగ్రెస్ తోనే సాధ్యం

పేదల సొంతింటి కల కాంగ్రెస్ తోనే సాధ్యం

- Advertisement -

– బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
తెలంగాణ రాష్ట్రంలో పేదల సొంతింటి కల కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని, ఎంతోమంది నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేనని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని చౌట్ పల్లి గ్రామంలో కుర్ర భాగ్య రమేష్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం చేసిన కుర్ర భాగ్య రమేష్ దంపతులకు ముత్యాల సునీల్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బహూకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల సొంతింటి కల నెరవేరుతుందన్నారు.ముఖ్యమంత్రి పేద ప్రజలకు అండగా నిలబడి సొంత ఇల్లు నిర్మాణం చేసుకొని ఆత్మగౌరవంతో బతికేల చేస్తున్నారని అన్నారు.

ఇండ్లు పూర్తయి గృహప్రవేశం చేస్తున్న కుటుంబాల కళ్లలో ఆనందం కనిపిస్తుందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికీ 3500 ఇండ్లను నిర్మిస్తున్నామని, ఇంకా అర్హత కలిగిన పేద వారికి ఎన్నైనా ఇండ్లు మంజూరు చేస్తామని సునీల్ రెడ్డి తెలిపారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, సీనియర్ నాయకులు నూకల బుచ్చి మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -