Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ రాష్ట్రం 

మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ రాష్ట్రం 

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌను
మత సామరస్యానికి ప్రతీకగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని, రాష్ట్ర మహిళా అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి అన్నారు. ఆలేరు పట్టణంలో సోమవారం ఆలేరు పట్టణం మరియు ముటకొండూర్, గుండాల, ఆత్మకూరు మండలాలకు చెందిన ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా, ఇఫ్తార్ విందు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా బండ్రు శోభారాణి మాట్లాడుతూ.. అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. అందులో భాగంగా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నెలలో రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేస్తుందన్నారు. డిఆర్ఓ జయమ్మ, తహసిల్దార్  వి ఆంజనేయులు, మున్సిపల్  కమిషనర్ కే శ్రీనివాసరెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి, ముస్లిం సోదరులతో కలిసి సహ పక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్    వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, కౌన్సిలర్లు మరియమ్మ, జెట్ట నీరజ, జూకంటి సంపత్, ముస్లిం సోదరులు ఎంఎ ఎజాస్, ఎండి జైనువుద్దీన్, ఎండి సలీం, అనీఫ్, ఎండి ఖలీల్, స్థానిక నాయకులు ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -