Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల కోసం క్రీడా పోటీలు

స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల కోసం క్రీడా పోటీలు

- Advertisement -

నవతెలంగాణ- ఆలేరు టౌన్  
నాలుగవ తరగతి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల కోసం, మండల స్థాయి క్రీడా ఎంపిక పోటీలు, ఆలేరు పట్టణంలో ఈ నెల 17వ తేదీ ఉదయం 8 గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి ఎర్ర లక్ష్మి సోమవారం విలేకరులకు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ పోటీలకు 01-09-2017 నుండి 31-08-2018 మధ్య జన్మించిన మూడో తరగతి  (2025.2026)లో పూర్తి కాబోతున్న విద్యార్థులు అర్హులని ఆయన పేర్కొన్నారు.

 రాష్ట్ర స్థాయిలో బాలికలకు 80 సీట్లు, బాలురకు 80 సీట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మండల స్థాయిలో నిర్వహించే ఈ ఎంపికలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయి ఎంపికలకు పంపిస్తామని చెప్పారు. ఈ సెలెక్షన్ ప్రక్రియలో భాగంగా 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల పరుగుపందెం, 6×10 మీటర్ల షటిల్ రన్, మెడిసిన్ బాల్ పుట్, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, హైట్, వెయిట్ వంటి బ్యాటరీ టెస్టుల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
పోటీలలో పాల్గొనదలచిన విద్యార్థులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆలేరు  ఫిజికల్ డైరెక్టర్ గడసంతల మధుసుధను (మొబైల్: 9000989671) ను సంప్రదించాలని కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -