Tuesday, March 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మురళి నివేదిక వాస్తవాలను దూరంగా ఉంది.

మురళి నివేదిక వాస్తవాలను దూరంగా ఉంది.

- Advertisement -

డేమోక్రటివ్ టీచర్స్ పెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి లింగా రెడ్డి
నవ తెలంగాణ – మల్హర్ రావు:-
విద్యారంగా సంస్కరణల మీద ప్రభుత్వానికి మాజీ కలెక్టర్ ఆకునూరి మురళి నివేదించిన నివేదిక వాస్తవాలకు దూరంగా ఉందని, ప్రభుత్వ మెప్పుకోసమే ప్రయత్నించే విధంగా ఉందని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని వల్లెంకుంట గ్రామానికి చెందిన డిటిఎఫ్ శ్రేయోభిలాషి ఐత రాజురెడ్డి తండ్రి సర్వారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృచెందారు. బాధిత కుటుంబాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి ఐత తిరుపతి, రాష్ట్ర కౌన్సిలర్ టి, సుదర్శనంతో పాటు మల్హర్, కాటారం మండలాల బాధ్యులతో కలిసి పరమర్షించి మాట్లాడారు. ఉపాధ్యాయులకు జీతాలు తగ్గించాలని పేర్కొనడం మురళి అవగాహన రహిత్యమన్నారు. నివేదిక దేనికొరకు రూపొందించిందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో విద్యారంగ సంక్షోభం రోజురోజుకు పెరిగిపోతుందని అందులో భాగంగానే పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయే విధంగా ప్రభుత్వాల విధానాలు ఉంటున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పాఠశాలలను మెరుగుపరిచి పర్యవేక్షణ పెంచి ఖాళీగా ఉన్న డిఈఓ, డిప్యూటీ డిఈఓ, డిఐఈటి కళాశాలలో ఖాళీలు నింపుతూ తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఒక గది ఉండే విధంగా రూపకల్పన చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. అలాకాకుండా యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ అని కొత్త కొత్త పేర్లతో మాట్లాడుతూ పాఠశాలలను మూసివేసే దిశగా విధానాలు ఉంటుంటే వీటి జోలికి పోకుండా మాట్లాడకుండా ప్రస్తుతం ఉన్న పాఠశాలలను క్లబ్ చేస్తే బాగుంటుందని పిల్లలు తక్కువగా ఉండడం మూలంగా ఖర్చు ప్రభుత్వానికి ఎక్కువ వస్తుందని, ఒక తప్పుడు అవగాహనతో నివేదిక రూపొందించారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు విద్య ఎలా అందుబాటులో ఉంటుందో చెప్పకుండా, పరోక్షంగా ప్రైవేటీకరణకు భూతం ఇచ్చే విధంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మురళి నివేదికలను కాకుండా ఉపాధ్యాయ సంఘం బాధ్యులు విద్యార్థుల సంఘ బాధ్యతలు పేరెంట్స్ కమిటీలతో పాటు విద్యారంగ నిపుణులతో అధ్యయనం చేయించి విద్యారంగాన్ని సంస్కరిస్తే బాగుంటుందని పేర్కొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -