Tuesday, March 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'ఉస్తాద్‌..' ఘన విజయం ఖాయం

‘ఉస్తాద్‌..’ ఘన విజయం ఖాయం

- Advertisement -

‘గబ్బర్‌ సింగ్‌’ వంటి సంచలన విజయం తరువాత పవన్‌ కళ్యాణ్‌, దర్శకుడు హరీష్‌ శంకర్‌ కలయికలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి నిర్మిస్తున్నారు. శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలు. ఉగాది కానుగా ఈనెల 19వ తేదీన థియేటర్లలో ఈ సినిమా అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ, ‘నా వరకు ఒకే ఒక్క హీరో మెగాస్టార్‌ చిరంజీవి. ఆయన పక్కన ఉంటే నేను హీరో అనే సంగతి మర్చిపోతాను. అలాంటి అన్నయ్య చిరంజీవి మా సినిమా ట్రైలర్‌ చూసి ట్వీట్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది.

అలాగే ట్వీట్‌ చేసిన రామ్‌ చరణ్‌కి నా కృతఙ్ఞతలు. ‘గబ్బర్‌ సింగ్‌’ తరువాత నేను, హరీష్‌ శంకర్‌ చేసిన సినిమా ఇది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం దర్శకుడు హరీష్‌ శంకర్‌. మీలో(అభిమానుల్లో) ఒకడు దర్శకుడైతే ఎలా ఉంటుందో అది హరీష్‌ శంకర్‌. ఈ సినిమా గబ్బర్‌ సింగ్‌ అంత విజయం సాధిస్తుందని నేను కోరుకుంటున్నాను. ‘పుష్ప, జనతా గ్యారేజ్‌, శ్రీమంతుడు’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను మైత్రి సంస్థ అందించింది. వాళ్లకు వరుస విజయాలు వస్తున్నాయంటే.. దాని వెనుక వారి కష్టం ఎంతో ఉంది’ అని అన్నారు. ‘డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కోరిక మేరకే ఈ సినిమాను ముందుగా ఉగాదికి తీసుకొస్తున్నాము. ఈసారి ఉగాది.. ఉస్తాద్‌ ఉగాది’ అని హరీష్‌ శంకర్‌ చెప్పారు.

నిర్మాతలు నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి మాట్లాడుతూ, ‘మేము ఎన్ని పెద్ద సినిమాలు చేసినా.. సినీ పరిశ్రమకు వచ్చిన తొలినాళ్ళ నుంచి మాకు పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేయాలనేది మా కల. ఈరోజు మాకు ఎంతో ప్రత్యేకం. మా కోరిక ఈ మార్చి 19న నెరవేరుతుంది. డిప్యూటీ సీఎం అయినా, ప్రజాసేవలో బిజీగా ఉండి కూడా.. మాకు ఈ సినిమా చేసి పెట్టిన పవన్‌ కళ్యాణ్‌కి మనస్ఫూరిగా కృతఙ్ఞతలు. గబ్బర్‌ సింగ్‌ని మించేలా ఈ సినిమాను తెరకెక్కించిన హరీష్‌ శంకర్‌కి ధన్యవాదాలు. ఇది పవన్‌ కళ్యాణ్‌ మార్క్‌ ఎంటర్టైనర్‌ సినిమా’ అని తెలిపారు.

మంచి ఫ్యామిలీ సినిమా
‘ఈ సినిమాతో పవర్‌స్టార్‌తో సినిమా చేయాలనే కోరిక నెరవేరింది. ఇందులో నా పాత్ర పేరు శ్లోక. చాలా మోడరన్‌ అమ్మాయి. నా పాత్రకు మంచి క్యారెక్టరైజేషన్‌ ఉంటుంది. పవన్‌ చాలా సింపుల్‌ పర్సన్‌, ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ కనిపిస్తారు. హరీష్‌ శంకర్‌ చాలా స్మార్ట్‌. ఆయనకు మాస్‌ పల్స్‌ బాగా తెలుసు. మైత్రి బ్యానర్‌లో పని చేసే వాతావరణం చాలా బాగుంటుంది. ‘గబ్బర్‌ సింగ్‌’లాగే ఈ సినిమా కూడా చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది’. -రాశి ఖన్నా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -