కార్మికులు, రైతులు సహా అన్ని వర్గాల నుంచీ ఆదరణ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) జన్ ఆక్రోశ్ జాతాలు ఉత్తరాది రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. మార్చి 24న ఢిల్లీలో నిర్వహించనున్న ర్యాలీకి ముందు ఈ జాతాలు నిర్వహిస్తున్నారు. ఈ జాతాలకు స్వాగతం పలికేందుకు కార్మికులు, రైతులు సహా అనేక మంది వస్తున్నారు. బీహార్‌లోని మాధేపుర జిల్లాలోని రజనీకి చేరుకున్న జాతాను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు విజు కృష్ణన్ స్వాగతం పలికారు.
ఈ ప్రాంతంలోని గిరిజనులు, దళితులకు చెందిన 350 ఎకరాల భూమిని రక్షించడానికి సీపీఐ(ఎం) నేతృత్వంలో జరిగిన పోరాటంలో మరణించిన వారికి జాతా నివాళులర్పించింది. బీహార్‌లో ఐదు గ్రూపులుగా ఈ జాతా నిర్వహిస్తున్నారు. నోయిడాలో నిర్వహించిన బహిరంగ సభలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ మాట్లాడారు. మార్చి 5న ఉత్తరాఖండ్‌లో ప్రారంభమైన జాతా విజయవంతంగా ముగిసింది. రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, యూపీలలో కూడా ఈ మార్చ్ కొనసాగుతోంది.
కొనసాగుతున్న సీపీఐ(ఎం) జన్ ఆక్రోశ్ జాతాలు
- Advertisement -
- Advertisement -



