Tuesday, March 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅసెంబ్లీ ఆవరణలో కొలువుదీరిన తెలంగాణ తల్లి

అసెంబ్లీ ఆవరణలో కొలువుదీరిన తెలంగాణ తల్లి

- Advertisement -

ఆవిష్కరించిన గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లా
పాల్గొన్న సీఎం, స్పీకర్‌, మండలి చైర్మెన్‌, మంత్రులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. పునరుద్ధరించిన శాసన మండలి భవనం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా శాసనసభ బడ్జెట్‌ సమావేశాల మొదటి రోజు ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ…ఇది రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు.

అంతకుముందు అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాల వద్ద గవర్నర్‌, ముఖ్యమంత్రి, ఇతర నేతలు ఘనంగా నివాళులర్పించారు. దేశానికి, సమాజానికి వారు చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దనసరి అనసూయ సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, రాజ్యసభ సభ్యులు వేం నరెందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -