Tuesday, March 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండలంలో ఇంటింటి సర్వే, అసెన్మెంట్

మండలంలో ఇంటింటి సర్వే, అసెన్మెంట్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికా కార్యక్రమంలో భాగంగా సోమవారం జుక్కల్ మండల కేంద్రంలోని గ్రామంలో ఇంటింటి సర్వే, న్యూ అసెస్మెంట్, అసెస్మెంట్ టాక్స్ ఫిక్సేషన్ చేయడము జరిగింది అని గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా జిపి కార్యదర్శి మాట్లాడుతూ.. గ్రామంలో ఇప్పటివరకు ఇంటి పన్నులు చెల్లించిన వారు ప్రస్తుతం పన్నుల మార్పిడి చేయడం జరుగుతుందని అన్నారు. గ్రామస్తులకు ముందు అవగాహన చేయడమే తమ ఉద్దేశమని పనుల విషయంలో ఎటువంటి విశేషాలు ఉండవని అందరు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ రాము, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్,జూనియర్ అసిస్టెంట్ రాజు, బిల్ కలెక్టర్ మనోజ్, వార్డు మెంబర్ ప్రకాశ్,గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -