నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని బషీరాబాద్ గ్రామానికి చెందిన ముండ్ల సరిత కు వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 2లక్షల ఎల్ఓసి మంజూరు పత్రాన్ని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం అందజేశారు.ముండ్ల సరిత ఎస్ఎల్ఈ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స ఖర్చులు అధికంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని కలిసి తమ పరిస్థితిని వివరించారు.
దీంతో వెంటనే స్పందించిన ప్రశాంత్ రెడ్డి ముండ్ల సరిత వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుండి రూ.2లక్షల ఎల్ఓసి మంజూరు చేయించారు. అట్టి ఎల్ఓసి మంజూరు పత్రాన్ని హైదరాబాదులోని తన స్వగృహంలో లబ్ధిదారు కుటుంబ సభ్యులకు అందజేశారు.వైద్య ఖర్చులకోసం ప్రభుత్వం నుండి ఎల్ఓసి మంజూరు చేయించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి గూండ్ల సరిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేసారు.



