అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తుల స్వీకరణ
నవతెలంగాణ – అచ్చంపేట
షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ (ఎస్సీ కార్పొరేషన్ ) ద్వారా సబ్సిడీ వాహనాలు కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగులు షెడ్యూలు కులాల శాఖ కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు చేసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే 2025 -2026 ఆర్థిక సంవత్సరానికి గాను 90% శాతం సబ్సిడీపై లక్ష రూపాయల విలువ గల విద్యుత్ ద్విచక్ర వాహనం, రూ.3 లక్షల విలువగల త్రి చక్ర వాహనం 70% శాతం సబ్సిడీ పైన ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ సోలార్ పరికరాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు 21 ఏళ్ల నుంచి 50 ఏళ్ళు వయసు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల వారు సంవత్సర ఆదాయం రూ.1,50,000/- పట్టణ ప్రాంతాల వారు రూ. 2 లక్షల లోపు ఉండాలి. మీ సేవల ద్వారా ఇటీవల తీసుకున్న కులం, ఆదాయం సర్టిఫికెట్లు జత చేయవలసి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఈనెల 17 నుంచి 24 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకొని సంబంధించిన జిరాక్స్ పత్రాలను ఆయా మండల పరిషత్ కార్యాలయంలో ఇవ్వాలి. జిల్లా వ్యాప్తంగా షెడ్యూల్ కులాల నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలి. మరిన్ని వివరాలకు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ శాఖ కార్యాలయంలో అధికారులను సంప్రదించాలి.
రాయితీ వాహనాలకు దరఖాస్తులు చేసుకోవాలి: ఎంపీడీవో వెంకటేష్, అచ్చంపేట
షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాయితీ వాహనాలు ఇచ్చేందుకు దరఖాస్తులు స్వీకరిస్తుంది. నిర్ణిత గడువు లోగా అర్హత గల యువకులు, రైతులు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి. సంబంధించిన దరఖాస్తు పత్రాలు జిరాక్స్ లు మండల పరిషత్ కార్యాలయంలో ఇవ్వాలి



