సంవిధాన్ మండల కోఆర్డినేటర్ మాచర్ల అనిల్ క్యాస్ట్రో
నవతెలంగాణ – తుంగతుర్తి
తెలంగాణ ఉద్యమకారులు,తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఇంటి పైన బిజెపి,ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేయడం హేయమైన చర్య అని సంవిధాన్ మండల కోఆర్డినేటర్ మాచర్ల అనిల్ క్యాస్ట్రో అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిటిషన్ అందజేసి మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడిన మాటలకు వివరణ ఇచ్చి,అపాలజీ చెప్పినప్పటికీ దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే రాబోయే రోజుల్లో దళిత సంఘాల కార్యకర్తలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,బిజెపి పార్టీకి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట పట్టణ అధ్యక్షుడు రాంబాబు,కొండ రాజు,కొండ పరుశురాం తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే సామేలు ఇంటిపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల దాడి హేయమైన చర్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



