Tuesday, March 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దేవాదాయ భూమిలో అక్రమ నిర్మాణాలను ఆపాలి

దేవాదాయ భూమిలో అక్రమ నిర్మాణాలను ఆపాలి

- Advertisement -

బొందును తవ్వి నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
తప్పుడు పత్రాలను సృష్టించి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసారని ఆరోపన
నవతెలంగాణ- నవాబు పేట
మండల కేంద్రంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించి గతంలో యన్మంగండ్ల శివారులో 777 సర్వేనెంబర్ లో ఆలయ పూజారి మఠం ఈశ్వరయ్యకు ధానం ఇనాం భూమి ఇచ్చారు. ఆ భూమిని మఠం ఈశ్వరయ్య వెంచర్ చేసి అమ్ముకుని దేవాలయ భూమి లేకుండా చేశారని, అట్టి భూమిపై గతంలో చాలా సార్లు గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కూడా ఫిర్యాదు చేసి ఆపారని గ్రామస్తులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో అదే సర్వే నంబర్ లో కొందరు వ్యక్తులు తప్పుడు పత్రాలను సృష్టించి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసారని, నవాబు పేట గ్రామస్తులు గత నెల రోజులుగా జిల్లా కలెక్టర్, ఆర్డీవో తహశీల్దార్ ముడా కార్యాలయంలో ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆ సర్వే నంబర్ లో కొందరికి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసి మరికొందరికి రిజిస్ట్రేషన్ చేయకుండా సంబంధించిన అధికారులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్న తీరుపై గ్రామస్తులు మండిపడ్డారు. ఇలా ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్న తీరుపై గ్రామస్తుల ఆద్వర్యంలో భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా 777 సర్వే నంబర్ లో బొందలను తవ్వి నిర్మిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -