Tuesday, March 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మేరీ మాత విగ్రహాన్ని తొలగించిన నిందితులను అరెస్టు చేయాలి

మేరీ మాత విగ్రహాన్ని తొలగించిన నిందితులను అరెస్టు చేయాలి

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి జహంగీర్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

భువనగిరి మండల పరిధిలోని జమ్మాపురం గ్రామంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న మేరీ మాత విగ్రహాంపై దాడి చేసి, విగ్రహాన్ని తొలగించి, కింద పడేసి అవమానపరిచిన నిందితులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మతసామరస్యంతో అందరు కలిసిమెలిసి ఉంటున్న యాదాద్రి భువనగిరి జిల్లాలో మతాల మధ్యన చిచ్చు పెట్టి మత సామరస్యాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నం చేస్తున్న మతోన్మాద దుండగులను గుర్తించి వారిపై కఠినమైన చర్యలను తీసుకోవాలి పోలీసు యంత్రాంగానికి సూచించినారు.

మంగళవారం భువనగిరి మండల పరిధిలోని జమ్మాపురం గ్రామంలో సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు మేరీ మాత విగ్రహాంపై దాడి చేయడాన్ని ఖండిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జిల్లా, మండల నాయకత్వం, గ్రామ ప్రజలతో కలిసి విగ్రహాన్ని జహంగీర్ పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి తమకు నచ్చిన మతాన్ని స్వీకరించి జీవించడానికి అవకాశం, హక్కు ఉన్నదని తెలిపారు. కానీ కొంతమంది మత ఉన్మాదులు దేశంలో మత ఘర్షణలు సృష్టించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రధానంగా దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీ లైన ముస్లింలపైన, క్రైస్తవులపైన మరియు వారి యొక్క ఆరాధన కేంద్రాల పైన దాడులు, దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారని విమర్శించారు.

క్రైస్తవ మతంలో అత్యంత భక్తితో కొలువబడే మేరీ మాత విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి దుండగులు ప్రయత్నించి మేరీమాత విగ్రహాన్ని కింద పడేయడం దుర్మార్గమైన చర్యని అన్నారు. ఇప్పటికే జమ్మాపురం గ్రామంలో ఉన్న  మేరీ మాత విగ్రహంపై రెండుసార్లు దాడి చేయడం హేయమైన చర్యని దీనిని ఖండిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా నిందితులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని వారు కోరారు. ఈ మధ్యకాలంలో బొమ్మలరామారం పరిధిలోని జలాల్ పూర్ గ్రామంలో కూడా మసీదుపై దాడి చేసి ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ ను మరియు మైకులను ఇతర వస్తువులను కూడా ధ్వంసం చేశారని తెలిపారు. మతసామరస్యానికి కేంద్రంగా ఉన్న భువనగిరి జిల్లాలో కొంతమంది మతోన్మాదులు, ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని విమర్శించారు.

ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు పోలీసు యంత్రాంగం మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తిస్థాయి విచారణ జరిపి, నిందితులను గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలని జహంగీర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి, చీమల కొండూరు గ్రామ సర్పంచ్ పల్లెర్ల అంజయ్య, జమ్మాపురం గ్రామం సర్పంచ్ చిన్నబత్తిని లూర్దయ్య, తోగడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిన్నబత్తిని బాలరాజు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శివర్గ సభ్యులు కొండ అశోక్, కొండమడుగు నాగమణి, గ్రామ ఉప సర్పంచ్ విజయరాణి, ప్రజలు సరూప రాణి, సునీత, సుందరి, మరియమ్మ, జోసెఫ్, అంతోని, జార్జీ, చిన్నయ్య, ప్రసాద్, సిస్టర్ జోసెఫ్ లు  పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -